వేరుశనగ క్వింటా రూ.7,300
కల్వకుర్తి: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు ఆదివారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి 253 మంది రైతులు 2,280 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి తెచ్చారు. క్వింటా గరిష్టంగా రూ.7,300, కనిష్టంగా రూ.5,602, సరాసరి రూ.6,809 ధర పలికినట్లు కార్యదర్శి శివరాజ్ తెలిపారు.
పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నా రు. యాసంగి వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో రైతులు, కూలీలు పెద్దఎత్తున తరలివచ్చారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపా రు. వాహనాలు కొనుగోలు చేసినవారు ఆల యం ఎదుట ప్రత్యేక పూజలు చేయించారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
చారకొండ: తమకు న్యాయం చేయాలంటూ బైపాస్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాఽధితులు మండల కేంద్రంలో చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం ఆరోరోజుకు చేరాయి. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బాలస్వామి, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చిల్వేరు శ్రీనివాసులు వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. బాధితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు ఆరురోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా స్పందించకుంటే ప్రజాసంఘాల మద్దతుతో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు సుమతమ్మ, బాలయ్య, కిరణ్, అలివేలు, చిట్టెమ్మ, లాలమ్మ, అనసూయ, కృష్ణయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన పద్యనాటక ప్రదర్శనలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఆదివారం రెండోరోజు కొనసాగాయి. కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి చెందిన రామాంజనేయ కళానాట్య మండలి కళాకారులు శ్రీరామాంజనేయ యుద్ధ ఘట్టం, శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో దేవేంద్ర సభ, శ్రీకృష్ణ రాయబారం, మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శ్రీవీరాంజనేయస్వామి నాట్య మండలి ఆధ్వర్యంలో కౌరవసభ, కళాకారుడు ఎ.శ్రీశైలం రావణ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ మన్యంకొండ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సహకారంతో మంగళవారం వరకు పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పద్యనాటక ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. సోమవారం వివిధ సంస్థలచే శ్రీకృష్ణాంజనేయ యుద్ధ ఘట్టం, మయసభ దుర్యోధన నాటకాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.
వేరుశనగ క్వింటా రూ.7,300
వేరుశనగ క్వింటా రూ.7,300
వేరుశనగ క్వింటా రూ.7,300
Comments
Please login to add a commentAdd a comment