రైతు దీక్షను విజయవంతం చేయాలి
వెల్దండ: రైతు దీక్షకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న ఆమనగల్లు పట్టణంలో రైతు దీక్షకు నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. అనంతరం కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టరాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడు, సింగిల్‌విండో డైరెక్టర్ శేఖర్‌ముదిరాజ్, నాయకులు వెంకటేశ్వర్‌రావు, భాస్కర్‌రావు, చంద్రమోహన్‌రెడ్డి, హన్మంత్‌నాయక్, లింగంముదిరాజ్, తిరుమల్‌రావు, అంజయ్య, అంజినాయక్, బాల్‌లక్ష్మయ్య, రాములు, సోమయ్య, పర్వతాలు, ఆనంద్, అశోక్, మధుసూదన్‌రెడ్డి, దేవేందర్, రాజు, పూరి రమేష్, శ్రీనుముదిరాజ్, రమేష్‌గౌడు, శేఖర్, వెంకట్, కొండల్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, రవి, జగన్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment