బిజినేపల్లి: సీఎఫ్‌ఎల్‌డీ పథకం ద్వారా నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నట్లు పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పాలెం కేవీకే ఆధ్వర్యంలో మండలంలోని వసంతాపూర్ గ్రామ రైతులకు నూనె గింజల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్‌లో నూనె గింజలకు మంచి డిమాండ్ ఉందన్నారు. నూనె గింజల పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. సీఎఫ్‌ఎల్‌డీ పథకం కింద వసంతాపూర్ గ్రామంలో 125 ఎకరాల మేర నువ్వుల పంటను సామూహిక ప్రదర్శన క్షేత్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రైతులకు పంట కీలక ఉత్పాదకాలు, వినియోగం, మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.రాజశేఖర్, ఆదిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment