నాగర్‌కర్నూల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి.. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజావాణికి 57 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment