కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం
నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని.. వారే తనకు ఆత్మీయులని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో తాడూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తల కృషితోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేశారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినట్లు వివరించారు. అలాంటి కార్యకర్తల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులందరికీ అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా ఆర్టీఏ మెంబర్ గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం
Comments
Please login to add a commentAdd a comment