బైపాస్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
చారకొండ: ఎన్‌హెచ్–167కే బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాసులు అన్నారు. మండల కేంద్రంలో బైపాస్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం ఏడో రోజుకు చేరింది. వారికి సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైపాస్ నిర్మాణంలో పేదలు నివాసగృహాలను కోల్పోయి 15 రోజులు కావొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బైపాస్ బాధితులకు నూతన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, రూ. 50లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు బాలస్వామి, శ్రీనివాసులు, ఆంజనేయులు, మల్లయ్య, వివిధ సంఘాల నాయకులు గోపాల్, ప్రేంకుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment