భక్తిభావంతో మెలగాలి
కల్వకుర్తిరూరల్: ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని మార్చాల హనుమాన్ దేవాలయంలో సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని కోరారు. అనంతరం గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, విజయ్‌కుమార్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, జలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థులకు
మరో అవకాశం
కందనూలు: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు గైర్హాజరైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు డీఐఈఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రతి విద్యార్థి ప్రాక్టికల్స్‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులకు సమాచారం అందించే బాధ్యత ప్రిన్సిపాళ్లదేనని.. ఎవరైనా సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment