సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
అచ్చంపేట రూరల్: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నడింపల్లిలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే వర్క్‌ఫ్రం హోం అంటూ కొందరు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. యువత తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, సీవీవీ నంబర్లు, పాస్వర్డ్స్ ఎవరికీ తెలియజేయరాదన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని.. కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. అనంతరం నడింపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రణాళికాబద్ధంగా చదివి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం జాఫర్, శ్రీనివాస్, విజయలక్ష్మి, సాజీద్, ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి నిరంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment