నేషనల్ హైవే అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు
కొల్లాపూర్: నేషనల్ హైవే 167కే నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణ కోసం అధికారులు కొల్లాపూర్ సమీపంలో మార్కింగ్ చేశారు. సోమశిల రోడ్డు నుంచి మల్లేశ్వరం సమీపంలో నిర్మించబోయే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి వరకు రహదారి పనులను మూడో విడత ప్యాకేజీలో చేపట్టనున్నారు. గతంలో హైవే కోసం మార్కింగ్ చేసిన స్థలాల్లో స్వల్ప మార్పులు చేశారు. రహదారి మలుపులు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 15 ఫీట్ల మేరకు మార్కింగ్ ఇచ్చారు. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో కుడివైపునకు గతంలో వేసిన మార్కింగ్ కంటే కొంతమేరకు అధికంగా స్థల సేకరణ చేపట్టనున్నారు. త్వరలోనే భూసేకరణ ప్రక్రియకు సంబంధిత అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులకు వచ్చే నెలలో టెండర్లు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment