నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే కీలకం
చారకొండ: ఒక సీసీ కెమెరా వంద మందితో సమానం అని, నేరాలు నియంత్రించడం, ఛేదించడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌ఐ శంషొద్దీన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వ్యాపారులు, నాయకులు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై రూ.3.50 లక్షల వ్యయంతో 32 కెమెరాల ఏర్పాటు చేసిన స్క్రీన్‌ను రిబ్బన్‌తో కట్ చేసి ప్రారంభించారు. అంతకు ముందే ఎస్పీకి కల్వకుర్తి డివిజన్‌లోని ఇద్దరు సీఐలు, ఎస్‌ఐలు పూలబొకేతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీమన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ సీసీల ఏర్పాటు చేయాలని, తద్వార నేరాలకు తావు ఉండదన్నారు. ప్రమాదాలు, నేరాలు, చోరీలు అరికట్టవచ్చని సూచించారు. అదేవిధంగా ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, యువత డ్రగ్స్‌కు బానిసగా మారుతున్నారని అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ వాటి నిర్మూలన కోసం పోలీసులకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి, వెల్దండ సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు శంషొద్దీన్, కురుమూర్తి, మాధవరెడ్డి, కృష్ణదేవ, నాయకులు వెంకట్‌గౌడ్, బాల్‌రాంగౌడ్, వెంకటయ్యగౌడ్, లక్ష్మణ్, వ్యాపారులు శ్యాం, శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి పరిశీలన
మండలలోని తిమ్మాయిపల్లి, సారంబండ మధ్యలో కల్వకుర్తి– దేవరకొండ ప్రధాన జాతీయ రహదారి ప్రమాదకరంగా ఉండటంతో ఎస్పీ పరిశీలించారు. రోడ్డు మూల మలుపులు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీఎస్పీకి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment