పాలమూరు: జిల్లా కేంద్రంలో ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మంగళవారం నగరంలోని న్యూటౌన్‌లో ఉన్న పలు హోటళ్లను తనిఖీ చేశారు. ఓ టీ పాయింట్‌లో చాయపత్తి, బిస్కెట్ల శాంపిల్స్, ఓ హోటల్‌లో వెజిటబుల్ బిర్యానీ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఓ మార్ట్‌కు సంబంధించి పలు రకాల తినుబండారాల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. అలాగే పరిశుభ్రంగా లేని హోటళ్లకు నోటీసులు అంటించారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్‌కుమార్, శిక్షణ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత, కరుణాకర్ పాల్గొన్నారు.
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
పాన్‌గల్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జీసీఈసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. వారిని చులకనగా చూడకుండా బాలురతో సమానంగా చదివించాలని సూచించారు. జీసీఈసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకొని సమస్యలను కాగితంపై రాసి బాక్సులో వేయాలన్నారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ రంగంలో తక్కువ కాదని.. నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment