వైభవంగా ఈదమ్మ షిడే ఉత్సవం
కొల్లాపూర్: పట్టణంలోని ఈదమ్మ జాతర షిడే మహోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. షిడే ఉత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఈదమ్మ దేవతకు బోనాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నూతనంగా ప్రతిష్టించిన ఈదమ్మ దేవత విగ్రహాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా షిడే మానుకు సాయంత్రం రైతు సంఘం నాయకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి వంశీకులు రాముడు షిడే మాను పైకి ఎక్కి భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
వైభవంగా ఈదమ్మ షిడే ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment