రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
కందనూలు: ఉస్మానియా విశ్వవిద్యాలయం మైదానంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభకనబరిచి పతకాలు సాధించారు. లాంగ్‌జంప్‌లో పి.అభిషేక్ గోల్డ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో జి.భానుప్రియ సిల్వర్, డిస్కస్‌త్రోలో కె.శివప్రసాద్‌రెడ్డి గోల్డ్‌మెడల్, షార్ట్‌ఫుట్‌లో రేవతి బ్రాంజ్ మెడల్, వెయ్యి మీటర్ల పరుగుపందెంలో మధుప్రియ సిల్వర్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌ను
సవరించాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్న కేంద్ర బడ్జెట్ గణాంకాలను సవరించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు వార్ల వెంకటయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయా పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ.. పేద ప్రజలపై భారాలు మోపడమేమిటని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంతో పాటు రైతుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరటనిస్తూ.. పేదల నడ్డి విరిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను వీడకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాస్, దేశ్యానాయక్, ఆంజనేయులు, శంకర్, హెచ్.ఆనంద్‌జీ, రవీందర్, కిషన్‌జీ, శివశంకర్, వెంకటయ్య పాల్గొన్నారు.
విద్యుత్ ఆర్టిజన్స్‌ను
కన్వర్షన్ చేయాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను కన్వర్షన్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు శ్రీను, భాస్కర్, సీఐటీయూ నాయకులు అశోక్, మధు, శంకర్, నవీన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.7,029
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 7,029, కనిష్టంగా రూ. 5,469, సరాసరి రూ. 6,269 ధరలు వచ్చాయి. మొత్తం 37మంది రైతులు 1,146 బస్తాల్లో 344 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకువచ్చారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment