ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి
తాడూరు: ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడూరు మండలం ఐతోలులో కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షకుడు, సర్వమానవాళి దిక్సూచి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు యువత పాటుపడాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడు ముందుండాలని పిలుపునిచ్చారు.
● ఐతోలు గ్రామవాసి, కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. యువతతోనే గ్రామాల అభివృద్ధి ముడిపడి ఉందని, రాజకీయాలకు అతీతంగా యువత ముందుకు సాగాలని కోరారు. పండుగ వాతవారణంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయ సాధనకు యువత సమష్టిగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సీఐ కనకయ్య గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ ఇందుమతి నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, హుస్సేన్, భూపతిరెడ్డి, లక్ష్మయ్య, రమేష్‌గౌడ్, అఖిల్‌రెడ్డి, హేమంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి
యువతతోనే అభివృద్ధి సాధ్యం
సినీ డైరెక్టర్ నాగ్ అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment