చర్యల్లేవ్
అనుమతుల్లేవ్..
తెలకపల్లి వివాదాస్పద భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
●
తెలకపల్లిలోని ప్రధాన రహదారిపై
అనుమతి లేకుండా నిర్మించిన దుకాణాలు
నోటీసులు ఇచ్చాం
మండల కేంద్రంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన దుకాణాలకు సంబంధించి గతంలోనే రెండుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– భాస్కర్, పంచాయతీ ఈఓ, తెలకపల్లి
విచారణ జరిపాం..
తెలకపల్లిలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లి విచారణ జరిపాం. విచారణకు సంబంధించిన రిపోర్ట్ జిల్లా పంచాయతీ అధికారికి అందజేశాం. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని రిపోర్ట్‌లో పేర్కొనడం జరిగింది.
– వరలక్ష్మి, డీఎల్‌పీఓ, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్: అధికారం బలం, అధికారుల అండ ఉంటే ఎంతటి అక్రమాలకై నా పాల్పడవచ్చనేది మరోమారు నిరూపితమైంది. తెలకపల్లిలోని ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా 40 దుకాణాలు నిర్మిస్తే కనీసం చర్యలు తీసుకునే పాపాన పోకుండా ఆ అక్రమాలకే సహకరించారు. గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఓ ప్రజాప్రతినిధి ఈ నిర్మాణాలకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాటిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అక్రమాల్లో అన్ని పార్టీల హస్తం ఉందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన రహదారిపై ఉండటం, విలువైన స్థలం కావడంతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కలెక్టర్‌కు నివేదిస్తాం..
తెలకపల్లిలోని సర్వే నంబర్ 497లో దుకాణాల నిర్మాణాలకు సంబంధించి విచారణ పూర్తయింది. మరో రెండు, మూడు రోజుల్లో వచ్చిన రిపోర్ట్‌ను స్టడీ చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం.
– రామ్మోహన్, డీపీఓ
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా
పట్టింపు కరువు
విచారణ పేరుతో చర్యలకు కాలయాపన
రాజకీయ నేతల
ప్రమేయంతోనే వెనుకడుగు
తాజా పరిణామాలపై కలెక్టర్ సీరియస్?
చర్యల్లేవ్
చర్యల్లేవ్
Comments
Please login to add a commentAdd a comment