తెలకపల్లిలోని సర్వే నం.497లో ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణ సముదాయ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ స్థలం భూదాన్ భూమి అని, దీనికి అసలైన వారసులం తామేనని, ఇద్దరు వ్యక్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. భూదాన్ భూమి తాము రిజిష్ట్రేషన్ చేసుకున్నట్లు కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మ్యూటేషన్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, తహసీల్దార్ కార్యాలయంలో ఎండార్స్‌మెంట్ కాపీ సైతం అందజేశారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు మాత్రం అధికారులు తీసుకోవడం లేదు. అంతేకాకుండా సదరు వ్యక్తులతో రాజీ కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిర్మాణ సమయంలో ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల వరకు అధికారులు, అప్పటి పాలకవర్గం వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా అధికారి వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో 2024 ఆగస్టు 12న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో డీఎల్‌పీఓ వరలక్ష్మి విచారణ జరిపినా.. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment