తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం | - | Sakshi
Sakshi News home page

తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం

Published Sun, Feb 23 2025 12:58 AM | Last Updated on Sun, Feb 23 2025 12:58 AM

తగ్గన

తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ 50శాతం దాటొద్దని ఆదేశాలు

బేస్‌ సంఖ్య స్థానాల్లో ప్రభావం

పలు మండలాల్లో ఒక్కొక్క స్థానం కోల్పోనున్న మహిళలు

ఎలాంటి ఆదేశాలు రాలేదు..

మహిళలకు రిజర్వేషన్‌ కేటాయింపు ప్రక్రియపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. కోడేరు మండలంలో ఆరు జీపీలు తగ్గాయి. పెద్దకొత్తపల్లిలో మూడు కొత్తగా ఏర్పాటయ్యాయి. జిల్లాలో మొత్తం 460 జీపీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.

– రామోహ్మన్‌రావు, డీపీఓ

అచ్చంపేట: స్థానిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్‌ కేటాయింపు విధానంలో పలు మార్పులు చేశారు. వీటి ఫలితంగా పలుచోట్ల మహిళల స్థానాలు స్వల్పంగా తగ్గనున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాలను మండల యూనిట్‌గా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను జిల్లా యూనిట్‌గా తీసుకుని రిజర్వు స్థానాలను కేటాయించనున్నారు. గతంలో మహిళలకు 50 శాతం స్థానాలు తగ్గకుండా రిజర్వు చేయాలనే ఆదేశాలతో సగం కంటే ఎక్కువ కేటాయించాల్సి వచ్చింది. ప్రస్తుతం మహిళలకు సగం కంటే ఎక్కువ స్థానాలు దాటొద్దనే నిబంధనను పరిగణనలోకి తీసుకోనున్నారు. తద్వారా బేస్‌ సంఖ్యలో స్థానాలు ఉన్న మండలాల్లో సమస్య రానుంది. ఇదిలా ఉంటే.. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా.. అందుకు పూర్థిస్తాయిలో సన్నద్ధమై ఉండాలని పంచాయతీరాజ్‌ శాఖ సూచించింది.

ఆరు జీపీలు ఔట్‌.. ఐదు ఇన్‌

గత ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 461 గ్రామపంచాయతీలు ఉండగా.. కోడేరు మండలంలోని ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, సింగాయిపల్లి, గుండావాయిని తండా, మాచుపల్లి, రేకులపల్లి జీపీలను వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఆరు జీపీలు తగ్గాయి. అదే సమయంలో పెద్దకొత్తపల్లి మండలంలో కొత్తగా ఏర్పాటైన బాచారం, సంజీవపూర్‌, కొత్తపేట జీపీలతో పాటు కొల్లాపూర్‌ మున్సిపాలిటీ నుంచి విలీనం రద్దయిన బోయలపల్లి (నర్సింగరావుపల్లి), తాళ్ల నర్సింగాపురం రెండు జీపీలు ఏర్పాటయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీల్లో 4,140 వార్డులు, 20 జెడ్పీటీసీ, 214 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించారు.

లక్కీ డ్రా విధానంలోనే..

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిశాకే లక్కీ డ్రా విధానంలో మహిళలకు రిజర్వు స్థానాలు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్‌ కేటగిరీల వారీగా లక్కీ డ్రా చేపడతారు. సర్పంచ్‌, ఎంపీటీసీలకు ఆర్డీఓ స్థాయిలో, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కలెక్టర్‌ స్థాయిలో రిజర్వేషన్లు కేటాయిస్తారు. పూర్తిస్థాయిలో బీసీ కులగణన పూర్తయ్యాక.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వేషన్‌ కేటాయింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.

పంచాయతీ ఎన్నికల్లోనూ..

గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు స్థానాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించనున్నారు. గతంలో ఉప్పునుంతల మండలంలో 27 గ్రామపంచాయతీలకు సగం లెక్కిస్తే.. 13.5 అవుతుంది. అక్కడ 14 జీపీలను మహిళలకు కేటాయించారు. ఈసారి అక్కడ మహిళలకు 13 జీపీలు మాత్రమే రిజర్వు చేయనున్నారు. బల్మూర్‌ మండలంలో 23, లింగాలలో 23 జీపీలు ఉండగా.. 11 స్థానాల చొప్పున మహిళలకు కేటాయించనున్నారు. గతంలో అచ్చంపేట మండలంలో 33 జీపీలు ఉండగా.. 17 సర్పంచ్‌ స్థానాలు మహిళలకు కేటాయించారు. ఈసారి ఇక్కడ కొత్తగా ఐదు జీపీలు ఏర్పాటు కావడంతో మొత్తం 38 ఉన్నాయి. మహిళలకు సగం అంటే 19 స్థానాలు వస్తాయి. బేస్‌ సంఖ్య వచ్చే ప్రతిచోట మహిళా రిజర్వు స్థానాలు తగ్గనున్నాయి. జిల్లాలోని చాలా మండలాల్లో బేస్‌ సంఖ్య కారణంగా మహిళల ప్రాతినిధ్యం తగ్గనుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ని కేటగిరిల్లోనూ సగం కేటాయించాల్సి ఉండటంతో.. ఇక్కడా బేస్‌ సంఖ్య వస్తే ఆ వర్గంలోనూ మహిళా స్థానాలు తగ్గుతాయి. మొత్తంగా మహిళల ప్రాతినిధ్యం కొంతమేర తగ్గనుందని చెప్పవచ్చు.

● జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండటంతో మహిళలకు సగం స్థానాలు వస్తాయి. సరి సంఖ్య రావడంతో రిజర్వేషన్‌ కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బంది ఉత్పన్నం కాదు. ఇందులో సగం అంటే 10 స్థానాలు కేటాయించాల్సిందే. బేస్‌ సంఖ్య వచ్చే మండలాల్లో మాత్రమే రిజర్వేషన్లలో స్పల్ప మార్పులు జరగనున్నాయి.

బేస్‌ సంఖ్య స్థానాల్లోనే సమస్య..

అమ్రాబాద్‌ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అందులో సగం అంటే 4.5 అవుతుంది. అలాగే పదర మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 2.5గా పరిగణించాలి. గతంలో ఆయా మండలాల్లో 5, 3 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. ఎందుకంటే మహిళలకు సగం కంటే ఎక్కువ స్థానాలు దాటొద్దనే నిబంధనను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త విధానంతో అక్కడ మహిళలకు 4, 2 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే కేటాయించనున్నారు. బల్మూర్‌ మండలంలో 11, కల్వకుర్తిలో 11, వెల్దండలో 11, బిజినేపల్లి మండలంలో 21 స్థానాలు ఉండగా.. ఒక్కో స్థానం మహిళలకు తగ్గనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం 1
1/1

తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement