తొక్కులే ఎక్కువ తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం.
– దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లా
సరైన ఆహారం లభించట్లేదు..
చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
– డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ
తొక్కులే ఎక్కువ తింటాం
Comments
Please login to add a commentAdd a comment