కొల్లాపూర్‌లో అస్తవ్యస్తం
కొల్లాపూర్: మున్సిపాలిటీలో మురుగు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని చాలా కాలనీల్లో సైడ్ డ్రెయిన్లు లేక మురుగు రోడ్లపైనే పారుతోంది. 16వ వార్డులో అన్నపూర్ణ లాడ్జి నుంచి వరిదేల చెరువు వరకు ప్రధాన మురుగు కాల్వ ఉండగా.. కేఎల్‌ఐ గెస్ట్‌హౌజ్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాల ముందుగా పారుతుంది. దీన్ని ఆధునీకరించేందుకు గత ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేసింది. టెండర్లు సైతం పూర్తి చేసినా పనులు మొదలుపెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ టెండర్లు నిర్వహించారు. గతేడాది నవంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ పర్యటన నేపథ్యంలో కాల్వ ఆధునీకరణ కోసం అధికారులు గతంలో నిర్మించిన గోడలను కూల్చివేసి, కాల్వ వెంట నిర్మాణాలు, డబ్బాలు తొలగించారు. అయినప్పటికీ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో కాల్వ నిండా మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. అలాగే 13వ వార్డులో ఎస్సీ హాస్టల్ నుంచి గోమతి స్కూల్ వరకు మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో పెంట్లవెల్లికి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం మురుగు పారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, 1, 5, 8, 17 వార్డుల్లో పలుచోట్ల మురుగు కాల్వలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment