ఆ భూములు గిరిజనులకే దక్కాలి
ఊర్కొండ: గిరిజనులకు సంబంధించిన భూములు వారికే దక్కాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని గునగుండ్లపల్లి పంచాయతీ రెడ్యాతండా సమీపంలోని ఊర్కొండపేట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నం.186లో గల 109 ఎకరాల అసైన్డ్ భూమి తరతరాల నుంచి గిరిజనుల స్వాధీనంలో ఉందని, ఆ భూమిని ప్రస్తుతం ఇతరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో తండావాసులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రెడ్యాతండాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు సందర్శించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసైన్ భూములు గిరిజనులకు దక్కే విధంగా చూస్తామని, అదేవిధంగా తండా ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ వారు ఏనాడు కూడా ఇక్కడ సేద్యం చేయలేదని, అలాంటి వారు ఇప్పుడు గిరిజనులను మా భూములు మాకే చెందుతాయని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. గిరిజనులకు సంబంధించిన భూములను గిరిజనులకు చెందేలా తనవంతు కృషిచేస్తానన్నారు. అధికారులు ఎలాంటి తప్పిదాలు చేయకుండా అసైన్డ్ భూములు నిరుపేద గిరిజనులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చామని, గిరిజన నాయకులు మాట్లాడిన విధానం చూస్తుంటే ఇక్కడ కొందరు కావాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు వాస్తవాలను నెల రోజుల్లో తెలియజేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ రామకోటి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ ఎస్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌నాయక్, ఓయూ జేఏసీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకులు రాజునాయక్, తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రేమ్నాయక్, నాయకులు జనార్దన్‌రెడ్డి, రమేష్‌నాయక్, దుర్గాప్రసాద్, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
జాటోత్ హుస్సేన్ నాయక్
Comments
Please login to add a commentAdd a comment