విలీన గ్రామాలపై చిన్నచూపు
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో ఎండబెట్ల, ఉయ్యాలవాడ, దేశిఇటిక్యాల, నాగనూల్ గ్రామాలను విలీనం చేశారు. అయితే ఆయా గ్రామాలపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం అయిన తర్వాత పక్కా ప్రణాళికతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేయడంతో మురుగు ప్రవాహం నిలిచిపోయింది. అయితే విలీనమైన వార్డుల్లో ఎలాంటి పనులు చేపట్టకపోవడం, ఆయా వార్డులను మున్సిపల్ సిబ్బంది పట్టించుకోపోవడంతో పారుశుద్ధ్యం లోపించింది. కనీసం ఓపెన్ డ్రెయినేజీలను శుభ్రం చేయకపోవడంతో రోడ్లపై మురుగు పారుతూ.. కాలనీలు కంపు కొడుతున్నాయి. దీంతో వార్డుల్లో ప్రజలు దోమలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఓపెన్ డ్రెయినేజీలు ధ్వంసం కావడంతో మురుగు ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. పట్టణంతో సమానంగా ఇంటి పన్నులు కడుతున్న తమకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని విలీన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment