క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం
బల్మూర్: క్రీడా పోటీలతో విద్యార్థుల ఆరోగ్య సామర్థ్యాలు పెరిగి శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని ఐటీడీఏ అధికారి శంకర్ అన్నారు. మండలంలోని బాణాల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగో తరగతి విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 24 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నుంచి సుమారు 90 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారికి ఎత్తు, బరువు, 30 మీటర్ల పరుగు, మెడిసిన్ బాల్‌త్రో, ఫ్లయింగ్ రన్స్, స్టాండింగ్ బాడీ జంపు తదితర తొమ్మిది రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభకనబర్చిన బాలురు 10 మంది, బాలికలు 10 మందిని ఈ నెల 21న హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏసీఎంఓ తిరుపతయ్య, స్సోర్ట్స్ ప్రత్యేకాధికారి భీమ్లానాయక్, హెచ్‌ఎంలు చంద్రశేఖర్, బయన్న, రాములు, పీడీలు నరేష్, ఆంజనేయులు, రాజు, జ్యోతి, పెద్దయ్య, అంజి, జానకిరాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment