తొలిరోజు ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 6,817 మంది విద్యార్థులకు గాను 6,449 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,172 మందికి గాను 4,924 మంది, ఒకేషనల్ విభాగంలో 1,645 మందికి గాను 1,525 మంది హాజరై పరీక్షలు రాశారు. జనరల్‌లో 248 మంది, ఒకేషనల్ విభాగంలో 120 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరిగాయి. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
విద్యార్థిని తనిఖీ చేస్తున్న సిబ్బంది
తొలిరోజు ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment