కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పసియొద్దీన్ అన్నారు. గురువారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన కాంట్రాక్టు సంస్థ కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరితే అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. ప్రతినెలా పీఎఫ్ కట్ చేయాల్సి ఉన్న 3 సంవత్సరాలు పీఎఫ్ కట్ చేయకుండా కార్మికుల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య, కార్మికులు బాలకృష్ణమ్మ, రాధ, రేణుక, లక్ష్మి, సంతోష, శ్రీదేవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment