సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్‌పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment