‘భవిత’కు భరోసా..
విలీన విద్యావనరుల కేంద్రాలకు నిధులు
విద్యార్థులకు సులభంగా
అర్థమయ్యేలా..
భవిత కేంద్రాల్లోని పిల్లల విద్యాభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చాలా ఏళ్ల తర్వాత నిధులు మంజూరు చేసింది. భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఐఈఆర్పీలతో విద్య అందిస్తున్నారు. ఫిజియోథెరపీ, తదితర చికిత్సలు అందిస్తూ.. వారిలో మార్పునకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 5 కేంద్రాలకు రూ. 10లక్షల విలువైన సామగ్రి అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలు, ఐఈఆర్పీలకు కుర్చీలు, చికిత్స అందించేందుకు అనుకూలంగా టేబళ్లు, మసాజ్ బాల్, డంబుల్స్, రౌండ్ టేబుల్, అల్మారాలు, తదితర 115 రకాల వాటిని సమకూర్చేలా ఉన్నతాధికారులు మార్గనిర్దేశం చేశారు. ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, భవిత కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న పాఠశాల హెచ్‌ఎంల కమిటీ నేతృత్వంలో అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటారు.
అచ్చంపేట రూరల్: విలీన విద్యావనరుల (భవిత) కేంద్రాలకు నిధులు మంజూరయ్యా యి. కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన సామగ్రి, వసతుల కల్పన కోసం ఒక్కో కేంద్రానికి రూ. 2లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తూ.. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 10 – 12 ఏళ్ల తర్వాత భవిత కేంద్రాలకు నిధులు మంజూరు కావడం గమనార్హం. ప్రత్యేక అవసరాలు కలిగిన 18 ఏళ్లలోపు వారికి ఆటపాటలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భవిత కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పాఠశాల స్థాయి వయసు కలిగిన వారికి భవిత కేంద్రాల్లో.. 15 ఏళ్లు పైబడిన వారికి కళాశాలల్లో ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, మాట్లాడించడం, నడిపించడం వంటి వాటి కోసం ప్రత్యేకంగా నిపుణులను నియమించారు. గతంలో ఉమ్మడి జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున కేటాయించగా.. ఇటీవల కొత్తగా ఏర్పడిన మండలాల్లోనూ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి, తదితర సౌకర్యాలను సమకూర్చారు. అయితే సొంత భవనాలు కలిగిన కేంద్రాల్లో వివిధ పరికరాల ఏర్పాటు కోసం నిధులను వినియోగించనున్నారు.
అవసరమైన సామగ్రి కొనుగోలుకు అవకాశం
ఆటపాటలతో అందనున్న విద్య
ఐదు సెంటర్లకు మంజూరు..
జిల్లాలో సొంత భవనాలు ఉన్న ఐదు భవిత కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేస్తాం. విలీన విద్యావనరుల కేంద్రంలోని విద్యార్థుల విద్యాభ్యున్నతి కోసం అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలిస్తున్నాం.
– వెంకటయ్య, జిల్లా విలీన విద్య సమన్వయకర్త
‘భవిత’కు భరోసా..
‘భవిత’కు భరోసా..
Comments
Please login to add a commentAdd a comment