కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పెద్దకొత్తపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పెద్దకొత్తపల్లి మండలంలోని వెనచెర్ల నుంచి గన్యాగుల వరకు బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నక్కలపల్లి, ముష్టిపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. పాత యాపట్లలో రూ. 2.95కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి, చంద్రబండ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సాతాపూర్‌లో 200 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాగా.. అందుకు సంబంధించిన పత్రాలను మంత్రి అందజేశారు. అదే విధంగా జగన్నాథపురంలో ఆంజనేయస్వామి నూతన ఆలయంలో దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా పన మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఇప్పటికే పేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కాగా, సాతాపూర్‌కు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, మైసమ్మ ఆలయ చైర్మన్ శ్రీనివాసు లు, దండు నర్సింహ, గోపాల్‌రావు, శివకుమార్‌రావు, వెంకటేశ్వర్‌రావు, రమేష్‌రావు, రాజు, రవి కుమార్, బాలస్వామి, చంద్రయ్య, సత్యం, లక్ష్మణ్‌రావు, విష్ణు, వెంకటేశ్వర్‌రెడ్డి, కొండల్‌గౌడ్ పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి కృషి
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పించి.. మెరుగైన విద్య అందించేందుకు గాను ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment