పాడిపంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలి
తిమ్మాజిపేట: పచ్చని పంటలతో అధిక దిగుబడి సాధించి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని అప్పాజిపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర, వాల్మీకి మహర్షి ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. స్థానికంగా ప్రజలు అడగక ముందే గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. ఒక్కొక్కటిగా పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు యాగశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి సమ ర్పించారు. వాల్మీకి, సీతారామచంద్రులను దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. అప్పాజిపల్లి గ్రామంలో ఈ నెల 8 నుంచి నిర్వహించిన దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. సీతారామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయస్వామి, వాల్మీకి విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలను పూజారి గంగాధరశర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు వివేక్‌రెడ్డి వాల్మీకి ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రూ.25 వేలు అందజేశారు. మూడు రోజులపాటు స్వప్న– యశ్వంత్, స్వాతి– నర్సింహస్వామి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. వాల్మీకి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment