అడ్రస్ లేని అండర్ గ్రౌండ్
పేరుకేమో పట్టణాలు– మున్సిపాలిటీలు.. పెద్ద పెద్ద భవంతులు.. విశాలమైన రోడ్లు.. పైకి మాత్రమే కనిపించే సోపుటాపులు ఇవి. కానీ, కొద్దిగా గల్లీల్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది ఆసలు బాగోతం.. అచ్చం పల్లెటూర్ల మాదిరిగానే రోడ్లపైనే పారుతున్న మురుగు.. వాటిలో పందుల స్వైరవిహారం, దోమల విజృంభణ షరామామూలుగానే కనిపిస్తాయి. జిల్లాకేంద్రం మినహా.. జిల్లాలోని మిగతా మూడు మున్సిపాలిటీలైన కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తిలో ఇదే దుస్థితి ఎదురవుతుంది. ఎక్కడా భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్యలకు దారితీస్తోంది.
● జిల్లాకేంద్రం మినహా మిగతా విలీన గ్రామాల్లో అధ్వానం
● రోడ్లపైనే పారుతున్న మురుగుతో తప్పని అవస్థలు
● దోమలు, పందుల స్వైరవిహారంతో రోగాల వ్యాప్తి
● వర్షాకాలంలో తీవ్రమైన సమస్యలు
కొల్లాపూర్‌లోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట
ఆధునికీకరణకు నోచుకోని మురుగు కాల్వల
ఇళ్ల మధ్యనే మురుగు
కల్వకుర్తి రూరల్: రోజురోజుకూ విస్తరిస్తున్న కాలనీలతో కల్వకుర్తి మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాలనీలు విస్తరిస్తున్నా.. అందుకు అనుగుణంగా మున్సిపాలిటీ సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని 22 వార్డుల పరిధిలో కొత్తగా కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. అయితే చాలాచోట్ల మురుగు పారేందుకు సరైన కాల్వలు లేవు. శ్రీశైలం– హైదరాబాద్ హైవే సమీపంలో ఇళ్ల మధ్యనే మురుగు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుంది. ఇక్కడికి సమీపంలోనే పాఠశాల కొనసాగుతున్నా అధికారులకు పట్టడం లేదు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేస్తే దుర్గంధం తొలగడంతోపాటు, దోమల సమస్య తీరుతుంది. సుభాష్‌నగర్‌కాలనీ, మార్గదర్శికాలనీ, జింజర్ హోటల్ సమీపంలో, విద్యానగర్, తిలక్‌నగర్, కల్యాణ్‌నగర్– 1, 2, పద్మశ్రీనగర్, వాసవీనగర్ తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నిధులు కేటాయిస్తాం
మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ అత్యవసరంగా మురుగు కా ల్వల నిర్మాణం అవసరం ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం.
– మహమూద్ షేక్,
మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి
పన్నులు చెల్లిస్తున్నాం..
పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తేనే దుర్గంధం తొలగిపోయి.. దోమల బాధ తగ్గుతుంది. పెరుగుతున్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పన్నులు చెల్లిస్తున్నా.. సదుపాయాల కల్పన అంతంత మాత్రమే ఉంది.
– మురళి, వాసవీనగర్, కల్వకుర్తి
●
అడ్రస్ లేని అండర్ గ్రౌండ్
అడ్రస్ లేని అండర్ గ్రౌండ్
Comments
Please login to add a commentAdd a comment