ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగి తరించారు. అనంతరం శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, నిత్యహోమాలు, బలిహరణం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ ఆవరణలో ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహరావు, ఈఓ నర్సింహులు, పాలకవర్గ సభ్యులు గణేష్‌గౌడ్, స్వరూప, కృష్ణయ్య, ప్రదీప్‌ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.