ఉత్సాహంగా వృషభరాజాల బల ప్రదర్శన
ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం అంతర్రాష్ట్రస్థాయి వృషభరాజాల బల ప్రదర్శన (బండలాగుడు) పోటీలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గం, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి పోటీలను ప్రారంభించగా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదు జతల ఎద్దులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోరులో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా పల్కన్‌దొడ్డకు చెందిన ఖాజా హుస్సేన్ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలవగా.. మాజీ ఎంపీటీసీ గోపిరెడ్డి అనురాధ, రఘుపతిరెడ్డి రూ. 50వేల నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కర్నూల్ జిల్లా నంద్యాల బేతంచర్ల ఉస్సేనాపూర్‌కు చెందిన వెంకటసుబ్బారెడ్డి ఎద్దులకు రూ. 40వేల బహుమతిని మాజీ ఎంపీపీ తిప్పర్తి అరుణ, నర్సింహారెడ్డి అందజేశారు. అదే విధంగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమానులకు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంగుల నర్సింహారెడ్డి, కొత్త మధుసూదన్‌రావు, మోహన్‌గౌడ్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వేముల నర్సింహారావు, ఈఓ నర్సింహులు, కమిటీ సభ్యులు గణేశ్‌గౌడ్, స్వరూప, నాయకులు అనంతరెడ్డి, అనంత ప్రతాప్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment