నేరుగా డంపింగ్ యార్డుకే..
నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ బాగానే ఉన్నా.. డంపింగ్ యార్డు నిర్వహణలో మాత్రం అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకేంద్రం శివారులోని చందాయపల్లి శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో ఉదయం, సాయంత్రం 9 ఆటోలు, 3 ట్రాక్టర్ల ద్వారా ఇంటింటి తిరగడంతోపాటు ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల నుంచి రోజువారిగా దాదాపు 40– 50 క్వింటాళ్ల చెత్త సేకరిస్తున్నారు. ఈ చెత్తను చందాయపల్లి శివారులో ఉన్న డంపింగ్ యార్డు తరలిస్తారు. అయితే ప్లాస్టిక్ కూడా కలిపి ఒకేచోట డంపింగ్ చేస్తున్నారు.
మిషన్ లేకపోవడంతో..
మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను వేరు చేసి ప్లాస్టిక్ కాల్చి వేయకుండా రీ సైక్లింగ్ చేయాల్సి ఉంది. కానీ, రీసైక్లింగ్ మిషన్ లేకపోవడంతో ప్లాస్టిక్‌ను సైతం అలాగే వదిలేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ఏరుకునే వారు తీసుకుపోగా.. మిగిలింది అక్కడే కాల్చేస్తున్నారు. మున్సిపల్‌లో రీ సైక్లింగ్‌కు నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రీ సైక్లింగ్ చేస్తే దాని ద్వారా కూడా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా.. దీనిపై అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదు.
యార్డులోనే వదిలేస్తున్నాం..
ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే మిషన్ మన దగ్గర అందుబాటులో లేదు. ఒకవేళ రీ సైక్లింగ్ చేయాలంటే దీనికి ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసి అనంతరం మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ను డంపింగ్ యార్డులోనే వదిలేస్తున్నాం. చెత్తను ఏరుకునేవారు, మున్సిపల్ సిబ్బంది వాటిని తీసుకెళ్తున్నారు. మున్సిపాలిటీలో నిధుల కొరతతో రీ సైక్లింగ్ మిషన్ ఏర్పాటు చేయలేదు.
– నరేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
నేరుగా డంపింగ్ యార్డుకే..
నేరుగా డంపింగ్ యార్డుకే..
Comments
Please login to add a commentAdd a comment