21 రకాల వికలత్వాలకు ధ్రువపత్రాల జారీ
నాగర్‌కర్నూల్: గతంలో 7 రకాల వికలత్వాలకు మాత్రమే సదరం ద్వారా ధ్రువపత్రాలు ఇచ్చేవారని, ఇప్పుడు దీన్ని 21 రకాలకు పెంచారని అదనపు కలెక్టర్ దేవసహాయం తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని దివ్యాంగుల సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరం నుంచి యూనిక్ డిజెబిలిటీ ఐడీ కార్డు (యూడీఐడీ)ను ఎలా పొందాలనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మెడికల్ బోర్డు ద్వారా ఈ యూడీఐడీ కార్డును మంజూరు చేస్తారన్నారు. ప్రతి నెల మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని దాని ప్రకారం శిబిరానికి హాజరైతే యూడీఐడీ కార్డును పొందవచ్చన్నారు.