ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వడదెబ్బ నుంచి జాగ్రత్త వహించాలి
సాక్షి, నాగర్‌కర్నూల్: వేసవికాలం ప్రారంభమై రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకూ మధ్యాహ్న వేళల్లో ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. పెరిగిన ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే..
డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి
ముందస్తు ఏర్పాట్లు..
హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు..
జిల్లాలో వేసవికాలంలో వడదెబ్బ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఎక్కడైనా వడదెబ్బ కేసులు గుర్తిస్తే వెంటనే ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో రిపోర్టు చేస్తాం. వడదెబ్బ సోకిన వ్యక్తిని కేవలం గంటలోపు గోల్డెన్ హవర్‌లో ఆస్పత్రిలో చేర్పిస్తే వెంటనే రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం వహించి ఆలస్యం చేస్తే పరిస్థితి విషమించే అవకాశాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వడదెబ్బ బాధితులు, వైద్యసేవలు అత్యవసర సంప్రదింపుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 98667 56825 ఏర్పాటు చేశాం.
మధ్యాహ్నం వేళల్లో వీలైనంత వరకూ
బయటకు వెళ్లొద్దు
జనరల్ ఆస్పత్రి, పీహెచ్‌సీల్లో వడదెబ్బ
కేసులకు ప్రత్యేక ఏర్పాట్లు
అత్యవసర సమయంలో హెల్ప్‌లైన్
నంబర్‌ను సంప్రదించాలి
‘సాక్షి’తో డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి
అప్రమత్తతే ప్రధానం!