కొల్లాపూర్: రాష్ట్రంలో అన్నివర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఖాదర్‌పాషా దర్గా వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో మంత్రి పాల్గొని ముస్లింలకు ఫలహారం తినిపించి.. సహపంక్తి భోజనాలు చేశారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ముస్లింల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల ప్రారంభం
కొల్లాపూర్ డిపోకు నూతనంగా మంజూరైన 10 ఆర్టీసీ బస్సులను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. వీటిలో ఒక ఎక్స్‌ప్రెస్ బస్సు ఉంది. బస్సులో కొద్దిసేపు మంత్రి ప్రయాణించారు. ఆర్టీసీ డిపోకు సంబంధించిన పలు అంశాలను ఆర్‌ఎం సంతోష్‌కుమార్, డీఎం ఉమాశంకర్ మంత్రికి వివరించారు. డిపో అభివృద్ధి కోసం ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రయాణిలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ భన్సీలాల్, నాయకులు రహీంపాష, నయూమ్, అన్వర్‌పాష, ఎక్బాల్, నర్సింహరావు, నాగరాజు, నర్సింహ, కమలాకర్‌రావు, ధర్మతేజ, కిరణ్‌యాదవ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.