
మామిడి రైతుకు.. మార్కెట్ కష్టాలు
కొల్లాపూర్: మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్‌లో మార్కెట్ ఏర్పాటు కలగానే మారింది. ఇక్కడ మామిడి సాగు విస్తారంగా ఉన్నప్పటికీ.. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ప్రైవేటులో విక్రయించక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారి మామిడి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లాపూర్‌లో మార్కెట్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. స్థల సమస్య కారణంగా మార్కెట్ నిర్మాణం జరగడం లేదు. ఫలితంగా రైతులు హైదరాబాద్‌తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌లోని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే పంటను అమ్ముకుంటున్నారు.
కొల్లాపూర్‌లో కలగా మారిన మార్కెట్ నిర్మాణం
పండ్ల విక్రయాలకు
రైతులకు తప్పని అవస్థలు
ప్రైవేటు వ్యాపారుల
సిండికేట్‌తో నష్టాలు
మామిడి మార్కెట్ ఏర్పాటుతోనే రైతులకు మేలు