విష్ణు, స్వప్న (ఫైల్)
నల్లగొండ క్రైం : నల్లగొండ పట్టణ శివారు పానగల్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. నీలగిరి మున్సిపాలిటీ పరిధి పానగల్‌కు చెందిన ఓర్సు విష్ణు(34) తన భార్య స్వప్న(29)తో కలిసి బైక్‌పై పానగల్ రిజర్వాయర్ ప్రధాన తూము వద్దకు ఉదయం 5:30 గంటలకు వచ్చాడు. అక్కడ బైక్‌ను పార్క్ చేసి దంపతులిద్దరూ చందనపల్లి వైపు వాకింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నల్ల గొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం దంపతుల ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో గాయపడిన వారు అక్కడికక్కడే మృతిచెందారు. విష్ణు నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో కామర్స్ కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. గాయపడిన వారిని 108వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటి కే మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పక్షం రోజుల తర్వాత వాకింగ్‌కు వెళ్తే..
ఆ దంపతులకు ఇటీవల తీరిక లేకపోవడంతో వాకింగ్‌కు వెళ్లలేదు. 15రోజుల తర్వాత మంగళవారం వాకింగ్‌కు వెళ్లగా ప్రమాదం చోటుచేసుకుందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతులకు ఆరేళ్ల కుమారుడు కార్తీక్, రెండేళ్ల కుమార్తె విశిష్ట ఉన్నారు. మృతుడి సోదరుడు పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టుటౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరి శీలిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇటీవల ఇదే రోడ్డులో నకిరేకల్ మండలం తాటికల్ వద్ద జరిగిన ప్రమాదంలో నూతన దంపతులు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment