సాక్షి, యాదాద్రి, తిరుమలగిరి, హాలియా : భువనగిరి, ఆలేరు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. వీరంతా కాంగ్రెస్‌పార్టీ నుంచే విజయం సాధించడం విశేషం.
► వలిగొండ మండల కేంద్రానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అనిల్‌కుమార్‌రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పైళ్ల శేఖర్‌రెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
► యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన బీర్ల అయిలయ్య తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌నాయకునిగా పని చేసిన అయిలయ్య సైదాపురం పాల సొసైటీ చైర్మన్‌గా, సైదాపురం సర్పంచ్‌గా, యాదగిరిగుట్ట ఎంపీటీసీగా పని చేశారు.
► తుంగతుర్తి నుంచి పోటీ చేసిన మందుల సామేల్ తొలిసారి విజయం సాధించారు. చివరి నిమిషం టికెట్ దక్కించుకున్న సామేల్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌పై 51,094 భారీగా మెజార్టీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.
► మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జయవీర్‌రెడ్డి 41 వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి బరి నుంచి తప్పుకుని ఆయన వారసుడైన కుందూరు జయవీర్‌రెడ్డిని పోటీలో నిలిపారు. ఈ ఎన్నికల్లో కుందూరు జయవీర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
► మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్‌ను చివరి నిమిషంలో దక్కించుకున్న బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) బీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. బత్తుల లక్ష్మారెడ్డి ఇప్పటికే మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment