సేవాలాల్ మార్గంలో నడవాలి
మిర్యాలగూడ : గిరిజన ఆరాధ్య దైవం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి గిరిజనుడు నడవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం సంత్‌సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహాబోగ్ బండార్ కార్యక్రంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సంత్‌సేవాలాల్ ఆశయాలను గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ధీరావత్ స్కైలాబ్‌నాయక్, మాలోతు దశరథ్‌నాయక్, భూక్యా లక్ష్మణ్‌నాయక్, బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాక్టికల్స్‌కు 111 మంది గైర్హాజరు
నల్లగొండ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు శనివారం 111 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 1,661 విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1,602 మంది హాజరయ్యారు. 59 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,039 మంది హాజరుకావాల్సి ఉండగా.. 987మంది పరీక్ష రాశారు. 52 మంది గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment