ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా రెండు వారాలపాటు నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజావాణిలో వ్యక్తిగత సమస్యలు, భూములకు సంబంధించిన విషయాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
అత్యవసర పనులకు ప్రతిపాదనలు
గ్రామాల సందర్శన సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో అవసరమైన అత్యవసర పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్య అందేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment