నేత్రపర్వం.. నీరాజన మంత్ర పుష్పం
యాదగిరి క్షేత్రంలో వైభవంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం శ్రీస్వామి, అమ్మవారి తిరువీధి సేవోత్సవం కనుల పండువగా సాగింది. తిరువీధి సేవ యాగశాలకు ప్రవేశించిన అనంతరం ఇతిహాసాది పురాణ స్తోత్ర పారాయణాలు మూలమంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి, నీరాజన మంత్ర పుష్పం చేపట్టారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాది కుంభార్చన, మూర్తి మంత్ర హోమాలు, వారుణానువాక హోమం నిర్వహించారు. అనంతరం ఛాయాదివాసం, నిత్య పూర్ణాహుతి, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వేడుకలు చేపట్టి స్వామి, అమ్మవారి సేవను ప్రధానాలయంలోకి చేర్చారు. వానమామలై మఠం 31వ మధుర కవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి పాల్గొన్నారు.
నేత్రపర్వం.. నీరాజన మంత్ర పుష్పం
Comments
Please login to add a commentAdd a comment