బాధితులకు న్యాయం చేయాలి
నల్లగొండ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశించారు. పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులను ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమానికి పలువురు బాధితులు ఫోన్ చేసి వారి సమస్యను తెలియజేశారు. ప్రతి సోమవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. బాధితులు 8712658079 ఫోన్ చేసి తమ సమస్యను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
సదరం సర్టిఫికెట్లకు ‘స్వావలంబన్’
నల్లగొండ : సదరం సరిఫ్టికెట్ల జారీకి స్వావలంబన్ సైట్ అందుబాటులోకి వచ్చిందని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్తి తెలిపారు. దివ్యాంగులు htt pr-://w-w-w.rwav am ba nc-ar-d.gov.i n వెబ్‌సెట్ ద్వారా a pp y gor U ఈఐఈలో వారి వివరాలు సొంతంగా లేదా మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వీరికి నల్లగొండ జీజీహెచ్‌లో నిర్ధారణ పరీక్ష వైకల్య ధ్రువీకరణ కార్డులు పోస్టు ద్వారా పంపుతామని తెలి పారు. మీసేవలో నమోదు చేసుకున్న వారికి యూడీఐడీ ద్వారానే సర్టిఫికెట్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. వివరాల నమోదులో పేరు, తండ్రి పేరు, నివాసం, పుట్టిన తేదీలు తప్పులు లేకుండా చేసుకోవాలని సూచించారు.
బాధ్యతలు స్వీకరించిన
బెల్లి యాదయ్య
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ తెలుగు శాఖకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా నియామకమైన డాక్టర్ బెల్లి యాదయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లి యాదయ్య ప్రస్తుతం నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన యాదయ్యకు ఎంరిజిస్ట్రార్ అల్వాల రవి, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ డీన్ కొప్పుల అంజిరెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షురాలు అరుణప్రియ, జి.నర్సింహ, ఎం.సత్యనారాయణరెడ్డి, అనితకుమారి ఉన్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment