మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు
మిర్యాలగూడ టౌన్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నల్లగొండ రీజియన్ పరిధిలోని యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ డిపోల నుంచి పలు శివాలయాలకు 70 బస్సులను నడిపించనున్నారు. ప్రధానంగా శ్రీశైలం, మేళ్లచెరువు, సత్రశాల, వాడపల్లి, సోమప్ప దేవాలయాలకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక బస్సుల వివరాలు ఇలా..
● మిర్యాలగూడ డిపో నుంచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమప్ప దేవాలయానికి 5, అడవిదేవులపల్లిలోని సత్రశాలకు 5, వాడపల్లికి 5 బస్సులను నడిపించనున్నారు.
● కోదాడ డిపో నుంచి మేళ్లచెర్వుకు 30 బస్సులు నడపనున్నారు.
● దేవరకొండ డిపో నుంచి డిండి మీదుగా శ్రీశైలానికి 25 ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు అన్నీ ఏర్పాట్లను చేపట్టారు.
భక్తుల రద్దీని బట్టి ఆయా పుణ్యక్షేత్రాలకు అదనపు బస్సులు నడిపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment