ప్రజలు అపోహలకు గురి కావొద్దు
పెద్దఅడిశర్లపల్లి : అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లను వేసిన ఘటనపై ప్రజలు ఎవరూ అపోహలకు గురికావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం పెద్దఅడిశర్లపల్లి మండలలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఆమె.. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, జలమండలి, వెటర్నరి అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజర్వాయర్‌లో కోళ్లు వేసిన సంఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే డిసిప్లీనరీ బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపంచామన్నారు. కోళ్లు వేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నీరు ఎలాంటి కలుషితం కాలేదని, నీటి ప్రవాహంలో ఎలాంటి కోళ్ల కళేభరాలు లేవన్నారు. భూపాల్‌లోని ల్యాబ్‌కు నీటి నమూనాలు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, ఏఎస్పీ మౌనిక, ఇరిగేషన్ డీఈ నాగయ్య, వెటర్నరి డాక్టర్ మహేందర్‌రెడ్డి, సీఐ ధనుంజయగౌడ్, ఎస్‌ఐ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment