ఆడ, మగ పిల్లల్ని సమానంగా పెంచాలి
నల్లగొండ : మన ఇంటి నుంచే ఆడ, మగ పిల్లలను సమానంగా పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధిక చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ చట్టంపై ప్రతి మహిళా ఉద్యోగికి అవగాహన ఉండాలని, వారి కార్యాలయ పరిధిలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేధింపులకు గురైతే పిర్యాదు చేసేలా మహిళలకు ధైర్యం కల్పించాలన్నారు. డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ దీప్తి మాట్లాడుతూ ఈ చట్టాన్ని 2013లో పార్లమెంట్ ఆమోదించిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కెవి.కృష్ణవేణి, వివిద శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment