నల్లగొండ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో పోటీలు జరుగుతున్నట్లు డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 23వ తేదీలోగా rb.nic.in/rbnilayam ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 28న రాష్ట్రపతి భవన్‌లో బహుమతులు అందజేస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి 9848578845 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment