వాహనాలు చోరీకి గురికాకుండా..
భువనగిరి: భువనగిరి పట్టణంలోని బాగాయత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి సింగం వివేకవర్ధన్‌కు చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తితో గైడ్ టీచర్ వెంకటేశ్వర్లు సహాయంతో వాహనాలు చోరీకి గురికాకుండా పరికరాన్ని తయారు చేశాడు. ఈ ఎగ్జిబిట్ గత నవంబర్‌లో జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించగా రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించగా.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. జాతీయ స్థాయి పోటీలు ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు జరగలేదు. వివేకవర్ధన్ తయారు చేసిన పరికరాన్ని వాహనానికి అమర్చుకోవాలి. దానికి యాప్ ద్వారా పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఎవరైనా వాహనాన్ని చోరీ చేస్తే వెంటనే వాహనదారుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దీంతో వాహనదారుడు అప్రమత్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment