స్పెషల్ బెడ్ ఫర్ వాష్‌రూమ్
నల్లగొండ: కనగల్ మండలం దోరెపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి బొల్లం సందీప్ (ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు) గైడ్ టీచర్ శ్రీనివాస్‌రెడ్డి సూచనలతో రూపొందించిన స్పెషల్ బెడ్ వృద్ధులు, బెడ్‌పై నుంచి లేవలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారు వాష్‌రూమ్‌కు వెళ్లకుండానే బెడ్‌లో ఉండి కాలకృత్యాలు తీర్చుకునేలా ఈ ఎగ్జిబిట్‌ను రూపొందించారు. బెడ్ కింద బేషిన్ ఏర్పాటు చేశారు. పడుకున్న వ్యక్తి తనకు చేతులు పని చేస్తే ఆ బెడ్ పక్కన ఏర్పాటు చేసిన బటన్ నొక్కితే బెడ్ పైకి లేస్తుంది. దాంతో అతను సాధారణంగా కుర్చొనట్లుగానే కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. ఆ బేసిన్‌లో నీటి సౌకర్యం ఉంటుంది. కాలకృత్యాలు అయిన తర్వాత తిరిగి బేసిన్‌ను క్లీన్ చేసుకోవచ్చు. 2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా, రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ మనక్‌లో ప్రదర్శించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కాగా.. 2024 అక్టోబర్‌లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ మనక్‌లో దీనిని ప్రదర్శించి పలువురి మన్ననలు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment