ఎయిడ్స్ అవగాహన సదస్సుకు నిధులు విడుదల
నల్లగొండ టూటౌన్ : జాతీయ సేవా పథకం, ఎంజీ యూనివర్సిటీ ఇటీవల రెండు రోజుల పాటు రెడ్ రిబ్బన్ క్లబ్, పీర్ లీడర్స్ కన్వెనషన్ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సు ఇటీవల విజయవంతమైంది. దీంతో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి నిధులు విడుదలైనట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హేస్సేన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నిధుల విడుదల ఉత్తర్వులను డాక్టర్ మద్దిలేటికి అందజేశారు. ఒక రోజు ఉమ్మడి జిల్లాలోని రెడ్‌రిబ్బన్ కాలేజీల్లో ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, ప్రొఫెసర్ ఆకుల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, హరికిషన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment