నేటి ప్రజావాణి రద్దు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 3న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి.. పిర్యాదులు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె పేర్కొన్నారు.
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
హాలియా : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గిరిజన సంఘం పోరాడుతుదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం హాలియాలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్‌జీఎస్ సాగర్ నియోజకవర్గ, మండల స్థాయి నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు రమావత్ నరేష్ నాయక్, జవహర్ నాయక్, నేనావత్ అశోక్ నాయక్, కొర్ర రాజునాయక్ తదితరులు ఉన్నారు.
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
మోటకొండూర్ : మండల కేంద్రానికి చెందిన చామల భానుచందర్‌రెడ్డి – అర్చన దంపతుల కూతురు చామల లక్ష్మీఅభయారెడ్డి జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికై ంది. ఆదివారం హైదరాబాద్ కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అండర్–10 విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో లక్ష్మీఅభయారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం కై వసం చేసుకుంది. ఈనెల 22వ తేదీన విజయవాడలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననుంది. లక్ష్మీఅభయారెడ్డికి రాష్ట్ర ఆర్చరీ అసోషియేషన్ చైర్మన్ టి.రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూర్ బ్రాంచ్ చైర్మన్ ఎండీ పవన్‌కళ్యాణ్, మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రామారావు చేతుల మీదుగా బంగారు పతకం అందజేశారు. లక్ష్మీ అభయారెడ్డికి, కోచ్ వరికుప్పల స్రవంతికి పలువురు అభినందనలు తెలియజేశారు.
అందాల పోటీలను వ్యతిరేకించాలి
భానుపురి (సూర్యాపేట): తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వాలు కలిసి హైదరాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ప్రపంచ అందాల పోటీలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన సీ్త్ర, పురుషుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం లేకపోవడం దారుణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మూఢ విశ్వాసాలు, పితృస్వామిక భావ జాలం బలపడుతుందని తెలిపారు. ఈ సభలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి నరసమ్మ, సహాయ కార్యదర్శి రామలింగమ్మ, సుజాత, జయలక్ష్మి, జయసుధ, లింగమ్మ, సంతోష, ఉపేంద్ర, నాగలక్ష్మి, నవ్య, మహేశ్వరి, శృతి, పావని ఉన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
Comments
Please login to add a commentAdd a comment